English | Telugu
చిరు చెలరేగడం ఖాయమా??
Updated : Feb 5, 2015
రాజకీయాల్లో పాపర్ అయితే మాత్రం... సినిమాల్లో చిరు ఎప్పటికీ సూపరే! ఆయన సినిమాల్లో నెంబర్ వన్‌గా ఉన్నప్పుడే.. రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇప్పటికీ ఆ స్థానం పదిలంగానే ఉంది. కాకపోతే కాస్త పోటీ ఎక్కువంతే. ఒక వైపు నుంచి తమ్ముడు పవన్, మరో వైపు నుంచి మహేష్ బాబు చిరుకి పోటీ రావడం ఖాయం. మధ్యలో బాహుబలి ప్రభాస్‌కి తక్కువ అంచనా వేయడానికి వీల్లేదండోయ్! మొత్తానికి చిరుకి కఠిన పరీక్ష ఎదురు కానుంది. మూడు దశాబ్దాల కెరీర్‌లో చిరుకి బాలయ్య, వెంకీ, నాగ్ పోటీ ఇచ్చారే తప్ప... ఎప్పుడు చిరుని క్రాస్ చేసి వెళ్లలేకపోయారు. కాకపోతే ఇప్పుటి పరిస్థితి వేరు. రాజకీయాల్లో చేరి మటాష్ అయిపోయాడు చిరు. క్రేజ్ మసకబారింది. కానీ వెండి తెరపై ఇప్పటికీ రారాజే అనిపించుకోవాలంటే మరోసారి జూలు దులపాల్సిందే. `రాననుకొన్నావా, రాలేననుకొన్నావా` అంటూ డైలాగ్ చెప్పి - `దాయి దాయి దామ్మా..` అంటూ స్టెప్పులేస్తేగానీ చిరు స్టామినా ఏంటో అర్థం కాదు.
కాకపోతే చిరు ఇప్పుడు డిఫెన్స్‌లో పడ్డాడు. సందేహాలిస్తే పప్పులుడకవు. అందుకే ఠాగూర్, స్టాలిన్‌లాంటి సినిమాలు కాకుండా శంకర్‌దాదాలా హాయిగా సాగిపోయే వినోదాత్మక కథ ఎంచుకోవాలని డిసైడ్ అయ్యాడు. స్టోరీ ఆల్రెడీ రెడీలో ఉంది. మరి హీరోకి తగిన ఫిజిక్ కావాలి కదా. అందుకే ఇప్పుడు ఆ ప్రయత్నాలు కూడా కాస్త గట్టిగానే చేస్తున్నాడు. చిరు ముందున్న లక్ష్యం సుస్పష్టం.. వెండి తెరపై తనకున్న ఇమేజ్ చెక్కు చెదరలేదని తన 150వ సినిమాతో నిరూపించాలి. మళ్లీ తన ఫ్యాన్స్ అందరినీ తన వైపు తిప్పుకోవాలి. సినిమా పరిశ్రమను ఇంకొన్నాళ్లు ఏలాలి. అలా చేయాలంటే 150వ సినిమాతో ఆకట్టుకోవడం మినహా మరో మార్గం లేదు. అందుకే చిరు ఫోకస్ అంతా 150వ సినిమాపై పెట్టారు. తన కెరీర్‌లో ఎప్పుడూ లేనంత జాగ్రత్తపడుతూ కథ ఎంచుకొన్నారు. దానికి సరిపడ దర్శకుడి కోసం అన్వేషిస్తున్నాడు. ఆ కథకు సరిపోయేలా ఫిట్ అవుతున్నాడు. ఇంత జాగ్రత్త ఈ 30 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ తీసుకోలేదు చిరు. కానీ ప్రస్తుతానికి అభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్న అంశాలు ఇవే. చిరుని మళ్లీ వెండి తెరపై చూసుకొని మురిసిపోవాలని వీర ఫ్యాన్స్ కలలు కంటున్నారు. చిరు కూడా తన ఫ్యాన్స్‌ని రంజింప చేయడానికి భారీ కసరత్తులు చేస్తున్నాడు. చూస్తుంటే.. చిరు మళ్లీ వెండి తెరపై చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది. మళ్లీ బాక్సాఫీసు బద్దలు కొట్టడానికి, తెలుగు ప్రేక్షకుల్ని తన వైపుకు తిప్పుకోవడానికి చిరు దాదా వచ్చేస్తున్నాడు. హార్ట్ ఫుల్‌గా వెల్‌కమ్ చెప్పేయండి.