English | Telugu

చంద్ర సిద్ధార్థ కొత్త సినిమాకి వింత పేరు

చంద్ర సిద్ధార్థ కొత్త సినిమాలో వింత ఒకటుంది. ఇంతకీ ఈ చంద్ర సిద్ధార్థ ఎవరంటే గతంలో "ఆ నలుగురు" వంటి సామాజిక స్పృహ కలిగిన సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి దర్శకుడిగా ప్రవేశించారు. తన తొలి చిత్రంతోనే చంద్ర సిద్ధార్థ అత్యంత ప్రతిష్టాత్మకమైన మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేనంది అవార్డు సంపాదించారు. ఆ తర్వాత చంద్ర సిద్ధార్థ "మధుమాసం", "అందరి బంధువయా'' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాంటి చంద్ర సిద్ధార్థ ఒక కొత్త చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ కొత్త చిత్రానికి చంద్ర సిద్ధార్థ వింతైన పేరుని నిర్ణయించారు.

ఈ చిత్రానికి "ఈ పాట కోరినవారు గంభీరరావు పేట గంగపుత్ర కాలనీ నుంచి రాము, జ్యోత్స్న, రవి, మురళి, కిరణ్, చందు మొదలగువారు" అన్న అతి పొగుడైన పేరుని నిర్ణయించటం సినీపరిశ్రమలో వింతగా చెప్పుకుంటున్నారు. చంద్ర సిద్ధార్థ తీయబోయే ఈ సినిమా పేరు కచ్చితంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదువుతుందని సినీ పరిశ్రమలోని అందరి అభిప్రాయం. ఈ పొడుగైన పేరున్న చిత్రానికి గతంలో "పెళ్ళైన కొత్తలో", "ప్రవరాఖ్యడు", "గుండెఝల్లుమంది" వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మదన్ సంభాషణలను వ్రాస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.