English | Telugu

మణిరత్నం సినిమాకి మహేష్ బాబు 12 కోట్లు

మణిరత్నం సినిమాకి మహేష్ బాబు 12 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంత వరకూ తెలుగు సినిమా చరిత్రలో ఇంత అధిక మొత్తం పారితోషికం తీసుకున్న నటులెవరూ లేరు. ఇది మహేష్ బాబుకి మాత్రమే దక్కిన ఒక అరుదైన రికార్డు. మణిరత్నం తాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తీయనున్న చారిత్రక చిత్రం కోసం తెలుగు, హింది భాషల్లో హీరోగా మహేష్ బాబు, తమిళంలో విజయ్ హిరోగా నటిస్తున్నారు.ఈ ముడు భాషల్లోనూ విక్రమ్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారని తెలిసింది. మణిరత్నం సినిమాకి మహేష్ బాబు 12 కోట్లు తీసుకోవటం న్యాయం కూడా.

ఎందుకంటే తెలుగు, హిందీ రెండు భాషలకు కలిపి ఈ మణిరత్నం సినిమాకి మహేష్ బాబు 12 కోట్లు పారితోషికాన్ని అందుకుంటున్నారు. అంటే ఒక విధంగా మహేష్ బాబు తెలుగు భాషకు ఆరు కోట్లు, హిందీ భాషకు ఆరు కోట్లు మణిరత్నం సినిమాకు తీసుకుంటున్నట్లు అనుకోవచ్చు. ఏది ఏమైనా మణిరత్నం సినిమాకి మహేష్ బాబు 12 కోట్లు పారితోషికం తీసుకోవటం బాక్సాఫీస్ వద్ద మన తెలుగు హీరో స్టామినాని తెలియజేస్తుంది. ఈ మణిరత్నం, మహేష్ బాబు సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్నట్లు తెలిసింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.