English | Telugu
మెగాస్టార్ మూవీ అప్డేట్ వచ్చింది!
Updated : Apr 27, 2023
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'భోళా శంకర్'. ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్సిల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన మెగాస్టార్ లుక్ ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి కీలక అప్డేట్ వచ్చింది.
'భోళా శంకర్' డబ్బింగ్ పనులు మొదలైనట్లు తెలుపుతూ మేకర్స్ తాజాగా ఒక ఫోటోను వదిలారు. పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పనులు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఫొటోలో దర్శకనిర్మాతలతో పాటు నటి సురేఖ వాణి కూడా ఉన్నారు. ఈ సినిమా ఆగష్టు 11 న విడుదల కానుంది. విడుదలకు మూడు నెలల ముందే డబ్బింగ్ పనులు మొదలు పెట్టడం విశేషం.
తమిళ్ ఫిల్మ్ 'వేదాళం'కి రీమేక్ గా రూపొందుతోన్న చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా డడ్లీ, ఎడిటర్ గా మార్తాండ్ కె. వెంకటేష్ వ్యవహరిస్తున్నారు.