English | Telugu

మహాబలిపురంలో 'బాహుబలి'

రామోజీ ఫిల్మ్ సిటీలో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న బాహుబ‌లి మూవీ యుద్ధ స‌న్నివేశాల చిత్రకరణ పూర్తయినట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా రామోజీ ఫిల్మ్ సిటీలో విశ్రాంతి లేకుండా భీక‌ర యుద్ద స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించారు రాజమౌళి. టెక్నీషియన్లు, ఆర్టిస్ట్ లు ఈ సన్నివేశాల కోసం చాలా కష్టపడ్డారు. ఇప్పుడు కొన్ని కీలక సన్నివేశాల కోసం బాహుబలి యూనిట్ చెన్నయ్ సమీపంలోని మహా బలిపురం ప్రాంతానికి తరలి వెళ్లనుంది. మహాబలిపురం దగ్గర సముద్రం, శిల్పాలు అన్నీ వుండడంతో అక్కడ 15 రోజులు పాటు సినిమా చిత్రీకరణ జరపనున్నారు. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ మూవీపై బాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనూ ఆస‌క్తి నెల‌కొంది. మొత్తానికి రాజ‌మౌళి, బాహుబ‌లి మూవీతో టాలీవుడ్ రేంజ్‌ను మ‌రో మెట్టు ముందుకు తీసుకువెళ‌తాడు అని అంటున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.