English | Telugu
బాలయ్య సినిమా పై వైరల్ అవుతున్న అనసూయ కామెంట్స్
Updated : Oct 24, 2023
నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం భగవంత్ కేసరి దసరా విన్నర్ గా నిలిచింది. విన్నర్ గా నిలవడమే కాదు తెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తుంది. భగవంత్ కేసరి లి బాలయ్య నటనకి అందరు దాసోహమయ్యారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన భగవంత్ కేసరి సినిమా గురించే చర్చ జరుగుతుంది. ఇలాంటి టైం లో బాలయ్య గురించి అలాగే భగవంత్ కేసరి సినిమా గురించి ప్రముఖ యాంకర్ ,నటి అనసూయ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు కలిసినా కూడా భగవంత్ కేసరి మూవీ లో ని ఒక సన్నివేశం గురించే చర్చించుకుంటున్నారు. సినిమాలోని ఒక సీన్ లో బాలయ్య ఒక స్కూల్ కి వెళ్లి అక్కడ ఉన్న చిన్నవయసు పాప లని ఉద్దేశించి ఒక మగవాడు మీ ఒంటి మీద ఎక్కడ చెయ్యి వెయ్యాలి ఎక్కడ చెయ్యి వెయ్యకూడదో అని వివరంగా చెప్తాడు. ఒక వేళ ఎవరైనా వేయరని చోటా చెయ్యి వేస్తే అమ్మకి చెప్పాలి అనే విషయాన్ని కూడా బాలయ్య చెప్తాడు. సినిమాలో ఈ సీన్ విపరీతంగా పేలింది. ఇప్పుడు ఈ సీన్ గురించే అనసూయ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తన ప్రతిస్పందనని తెలిపింది.ఎన్నో సంవత్సరాలుగా స్కూల్ కి వెళ్లే పాపలకి ఏది బాడ్ టచ్ ఏది గుడ్ టచ్ అనే విషయం మీద ఎంతో మంది అవగాహన ఇస్తూనే ఉన్నారు. కానీ ఎన్నో సంవత్సరాలుగా వారందరు పాపలకి చెప్తూ ఉన్నా కూడా ఎందుకనో ఆ విషయం అందరికి చేరలేదు.
ఇప్పుడు ఒకే సారి అందరి పాపలకి వాళ్ళ తల్లి తండ్రులకి చేరేలా బాలయ్య తన సినిమా ద్వారా చెప్పి పసిపాపలతో పాటు వాళ్ళ తల్లితండ్రుల్లో అలాగే ప్రజల్లో చైతన్యాన్ని నింపారని బాలయ్య రియల్లీ గ్రేట్ అని అనసూయ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడి చేసింది. అయితే తొలుత బాలయ్య తన సినిమా లో ఆడపిల్లలకి చెప్పిన విషయం మీద ప్రముఖ నటుడు ,దర్శకుడు అయిన రాహుల్ రవీంద్ర స్పందిస్తే బాలయ్య ని సమర్థిస్తూ రాహుల్ రవీంద్ర ట్వీట్ ని అనసూయ సమర్ధిస్తూ తన మద్దతు తెలిపింది.