English | Telugu

సెల్వరాఘవన్ దర్శకత్వంలో అల్లు అర్జున్

ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించబోతున్నాడు.ఈ చిత్రాన్ని తెలుగుతో సహా అన్ని దక్షిణాది భాషల్లో నిర్మించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ హీరోగా, సెల్వరాఘవన్ దర్శకత్వంలో రాబోయే ఈ చిత్రం సోషియో ఫాంటసి చిత్రంగా రూపొందనుంది.ఈ చిత్రం బహుశా ఈ సంవత్సరం చివర్లో ప్రారంభమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.సెల్వరాఘవన్ ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.అలాగే అల్లు అర్జున్ ప్రస్తుతం వివివినాయక్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్న "బద్రీనాథ్" చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.ఈ చిత్రం తర్వాత మార్చ్ 5 వ తేదీన స్నేహా రెడ్డి తో అతని వివాహం హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరుగనుంది. అనంతరం హనీమూన్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ చిత్రంలో నటిస్తారని తెలిసింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.