English | Telugu

ఫిబ్రవరి 24 న"ప్రేమ కావాలి"ప్రీమియర్ షో

సినిమా విడుదలకు ముందు ఏ సినిమానైనా సినీ పరిశ్రమలోని ప్రముఖులకు ప్రీమియర్ షో చూపించటం మామూలుగా ఆనవాయితీ.దానికి ఏ థియేటర్లోనో ఒక షో వేస్తూంటారు.కానీ ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో, మ్యాక్స్ ఇండియా పతాకంపై, ఆదిని హీరోగా పరిచయం చేస్తూ,కె.విజయభాస్కర్ దర్శకత్వంలో, కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న "ప్రేమ కావాలి" చిత్రాన్ని మాత్రం హైదరాబాద్ లో మూడు స్క్రీన్స్ మీద సినీ ప్రముఖులకు చూపిస్తున్నారు. ఒక వర్థమాన నటుడి చిత్రాన్ని మూడు థియేటర్లలో విడుదలకు ఒక రోజు ముందు సినిమా ప్రముఖులకు చూపించటమ చాలా అరుదు.అది ఆది ఈ చిత్రం హీరో సాయికుమార్ కొడుకవటం వల్ల, ఈ చిత్రాన్ని ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సమర్పించటం వల్లా, ఈ చిత్రాన్ని అచ్చిరెడ్డి వంటి సీనియర్ నిర్మాత నిర్మించటం వల్లా సాధ్యమయిందని చెప్పాలి. పన్నెండు కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల కానుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.