English | Telugu

అల్లు అర్జున్ పెళ్ళి తర్వాతే"బద్రీనాథ్"ప్రమోషన్

ప్రముఖ యువ హీరో అల్లు అర్జున్ వివాహం స్నేహా రెడ్డితో హైదరాబాద్ లోని హైటెక్స్ లో మార్చ్ 5 వ తేదీన జరుగనుంది. ఈ పెళ్ళికి ఏర్పాట్లలో అంటే షాపింగ్, వెడ్డింగ్ కార్డ్స్ ప్రింటు చేయించటం, వాటిని పంచటం, పెళ్ళి విందు ఏర్పాట్లు వగైరా వగైరాలతో ఇటు అల్లు అర్జున్ కుటుంబం, అటు స్నేహా రెడ్డి కుటుంబం యమ బిజిగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.అందుకని గీతా ఆర్ట్స్ పతాకంపై, వివివినాయక్‍ దర్శకత్వంలో, తన తండ్రి అల్లు అరవింద్ నిర్మిస్తుండగా,అల్లు అర్జున్ తాను హీరోగా, మిల్కీ వైట్ గర్ల్ తమన్నా భాటియా హీరోయిన్‍ గా నటిస్తున్న "బద్రీనాథ్" చిత్రం పబ్లిసిటీ గురించి, దాని ప్రమోషన్ గురించీ ఆలోచించట్లేదు. ఈ పెళ్ళి కాగానే తన "బద్రీనాథ్" చిత్రం ప్రమోషన్ ప్రయత్నాలు మొదలు పెట్టాలని అల్లు అర్జున్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.