English | Telugu
పవన్ కళ్యాణ్ తొలిప్రేమకు 17 సంవత్సరాలు
Updated : Jul 24, 2015
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు అంటేనే అభిమానులకు యమ క్రేజ్. సినీ రంగంలోనే స్టైల్ తో ఒక ట్రేండ్ ని సృష్టించాడు. తన మాటలు, చేతలు, నడక అన్నీ వైవిధ్యంగా ఉండటంతో చిత్రరంగంలో అందరికంటే ఎక్కువ అభిమానులను సొంతం చేసుకున్నాడు. మెగస్టార్ తమ్ముడిగా సినీ రంగుల లోకంలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ అన్న పేరు అంతగా ఉపయోగించుకోకుండానే.. తక్కువ కాలంలోనే తనకంటూ ఒక సెపరేట్ ట్రాక్ ను క్రియేట్ చేసుకున్నాడు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా అంతమంది అభిమానులను సంపాదించుకున్నారంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ కే సాధ్యమయింది. అలా ఆయన నటించిన సినిమాల్లో ఆయన కెరీర్ లోనే పెద్ద మైల్ స్టోన్ గా నిలిచిన చిత్రం తొలిప్రేమ. ఈ చిత్రం వచ్చి ఇప్పటికీ 17 సంవత్సరాలు పూర్తిచేసుకుంది.
ఈ చిత్రం అప్పటి జనరేషనే కే కాదు ఇప్పటి జనరేషన్ కూడా ఎంతో ఇష్టపడే సినిమా. ఎన్నో ప్రేమ సినిమాలు వచ్చినా కొన్ని సినిమాలు మాత్రమే మన మనసులో చిరస్థాయిగా మిగిలిపోతాయి అలాంటి సినిమాల్లో తొలిప్రేమ కూడా ఒకటి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో రెండువందల రోజులకు పైగానే ఆడి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి పవన్ కళ్యాణ్ కు స్టార్ స్టేటస్ ను తీసుకొచ్చింది. మరి ఇలాంటి సినిమాలు ఇంకా పవన్ కళ్యాణ్ తీయాలని ఎన్నో కోరుకుంటూ.. తొలిప్రేమ సినిమా 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అభినందనలు చెబుదాం..