English | Telugu

అఖిల్ 'గ‌ట్స్' చూపించేశారు

సిసింద్రీ అఖిల్‌ని వెండి తెర‌పై హీరోగా చూడాల‌ని అక్కినేని ఫ్యాన్స్ కోరిక‌! ఆ బాధ్య‌త భుజాన వేసుకొన్నారు వి.వి.వినాయ‌క్‌. ఎంత ల‌వ్ స్టోరీ అయినా.. అందులో యాక్ష‌న్‌ని బీభ‌త్సంగా మిక్స్ చేయ‌డం.... వినాయ‌క్ శైలి. దాంతో అఖిల్ యాక్ష‌న్ సీన్స్‌లో ఎలా ఉంటాడు? ఫైట్స్ ఎలా చేస్తాడు? అనే ఆస‌క్తి మ‌రింత ఎక్కువైంది. అందుకు సంబంధించి వినాయ‌క్ కూడా అఖిల్ యాక్ష‌న్‌ని అభిమానుల‌కు రుచి చూపించాల‌నుకొన్నారు. అఖిల్ - వినాయ‌క్‌ల సినిమా మేకింగ్ వీడియో ఒక‌టి శ్రేష్ట్ మీడియా విడుద‌ల చేసింది.

ఇందులో అఖిల్ గ‌ట్స్‌నీ చూపించారు వినాయ‌క్‌. ప‌రుగెడుతూ ప‌రుగెడుతూ ఓ కారెక్కి.. మ‌ళ్లీ దూకే సీన్‌ని అఖిల్ ఎలాంటి డూప్ లేకుండా పూర్తి చేయ‌డం ఈ వీడియోలో క‌నిపించింది. ఇలాంటి యాక్ష‌న్ థ్రిల్స్ ఈ సినిమాలో చాలా చాలా ఉంటాయంటున్నారు వినాయ‌క్‌. మొత్తానికి అఖిల్‌ని ఫ‌స్ట్ సినిమాలోనే యాక్ష‌న్ హీరోగా నిల‌బెట్టే ప్ర‌య‌త్నాలైతే చురుగ్గా సాగుతున్నాయ‌న్న‌ది అర్థ‌మ‌వుతోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.