English | Telugu

ప్రముఖ రచయిత ఆకెళ్ల కన్నుమూత!

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ఆకెళ్ల పేరుతో పలు సినిమాలకు రచయితగా పని చేసిన ఆకెళ్ల సూర్యనారాయణ కన్నుమూశారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆకెళ్ల.. ఆరోగ్యం విషమించి హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. (Akella Suryanarayana)

ఆకెళ్ల స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. చిన్నతనం నుండే నటుడిగా నాటకరంగంలో రాణించారు. ఆ తర్వాత రచయితగా ప్రయాణం మొదలుపెట్టారు. మొదట్లో చందమామ, బాలమిత్ర పత్రికలకు కథలు వ్రాసి పంపేవారు. డిగ్రీ పూర్తయిన తర్వాత మొదటి నవల రచించారు. ఆకెళ్ల సుమారు 200 కథలు, 20 నవలలను రచించారు. వీటిలో కొన్ని ఇతర భారతీయ భాషలలోకి అనువదించబడ్దాయి. 'కాకి ఎంగిలి', 'అల్లసాని పెద్దన', 'రాణి రుద్రమ', 'రాణాప్రతాప్‌' లాంటి నాటకాలు రాశారు. టీవీ సీరియల్స్‌కి కూడా పనిచేశారు.

సినీ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు ఆకెళ్ల. రచయితగా ఆయన తొలి చిత్రం మగమహారాజు. స్వాతిముత్యం, శ్రుతిలయలు, సిరివెన్నెల, శ్రీమతి ఒక బహుమతి, నాగదేవత, ఇల్లు ఇల్లాలు పిల్లలు, ఆయనకి ఇద్దరు, చిలకపచ్చ కాపురం, ఔనన్నా కాదన్నా వంటి చిత్రాలకు రచయితగా పని చేశారు. 'అయ్యయ్యో బ్రహ్మయ్య' అనే చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. 80కి పైగా సినిమాలకు కథలను, మాటలను అందించిన ఆకెళ్ల.. 15 ఏళ్ల పాటు తెలుగు రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. ఆకెళ్లకు ఎన్నో అవార్డులు లభించాయి. 13 సార్లు ఉత్తమ రచయితగా నంది అవార్డును అందుకోవడం విశేషం. కాకి ఎంగిలి నాటకానికి సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.

ఆకెళ్ల మృతి పట్ల తెలుగు పరిశ్రమ నుంచి పలువురు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలు శనివారం హైదరాబాద్‌లోని హఫీజ్‌పేటలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .