English | Telugu

తెలుగువన్ షార్ట్ ఫిల్మ్స్'కోటీ క్లిక్స్' దాటేస్తున్నాయి

యుట్యూబ్ షార్ట్ ఫిల్మ్ లో తెలుగు వన్ ఛానెల్ తన హావాను కొనసాగిస్తోంది. ఈ ఛానెల్ లో అప్లోడ్ అయిన షార్ట్ ఫిల్మ్స్ అవలీలగా కోటీ క్లిక్స్ ను దాటేస్తున్నాయి. రీసెంట్ గా 'పీకే 2' షార్ట్ ఫిల్మ్ ఆరు నెలల్లో ఒక కోటీ క్లిక్స్ రాబట్టుకొని సౌత్ ఇండియాలో నెంబర్ వన్ షార్ట్ ఫిల్మ్ గా నిలిచింది. ఇప్పుడు తెలుగు వన్ ఛానెల్ లో మరో షార్ట్ ఫిల్మ్ కోటీ విజిట్స్ ను ఈజీగా దాటేసింది.

అహాల్య అనే షార్ట్ ఫిల్మ్ 'కోటీ క్లిక్స్'దాటి ముందుకు పరుగులు తీస్తోంది. యుట్యూబ్ సౌత్ లో కోటీ క్లిక్స్ దాటిన రెండు షార్ట్ ఫిల్మ్స్ తెలుగు వన్ ఛానెల్ లోనె రావడం సరికొత్త రికార్డుగా చెప్పవచ్చు. అహాల్య యూట్యూబ్ లో కోటీ క్లిక్స్ దాటిన సందర్భంగా తెలుగువన్ సంస్థ ఈ టీమ్ అభినందలు తెలియజేసింది. షార్ట్ ఫిల్మ్ దర్శకులకు తెలుగువన్ సంస్థ అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని మరిన్ని ఉత్తమ షార్ట్ ఫిల్మ్ తీయాలని పిలుపునిచ్చింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.