English | Telugu

ఆడు పోయాడ్రా బుజ్జి

"అతడు" సినిమాలో మహేష్ ను "ఆడు మగాడ్రా బుజ్జి" అని అంటే ఆ డైలాగ్ సూపర్ హిట్టయింది. అదే డైలాగ్ పేరుతో మహేష్ బావ సుధీర్ హీరోగా తెరకెక్కింది. ఈ సినిమా నేడే విడుదలైంది. ఎప్పుడు లేని విధంగా సుధీర్ కొత్తగా ఇందులో పెద్ద ప్రయత్నమే చేసాడనిపిస్తుంది. సినిమా విడుదలైన క్షణం నుండి ఇప్పటివరకు సరైన టాక్ ను దక్కించుకోలేదు.

"ప్రేమకథాచిత్రం" వంటి హిట్ చిత్రం తర్వాత సుధీర్ నటించిన ఈ "ఆడు మగాడ్రా బుజ్జి" సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. పైగా దీనికితోడూ సుధీర్ సిక్స్ ప్యాక్ బాడీని ఈ సినిమాలోనే చూపించడం మరింత హైప్ ను క్రియేట్ చేసింది. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్ అని ముందు నుంచి చెప్తున్నా కూడా యాక్షన్ మాత్రమే చూపేంటి జనాలను థియేటర్ లోనే చావుదెబ్బలు కొట్టినంత పనిచేసింది ఈ సినిమా.

హీరోయిన్ అస్మితా ఈ సినిమాకు ఎలాంటి ప్లస్ అవకపోగా.. కొన్ని సన్నివేశాలలో అసలు ఈమె లేకున్నా బెటర్ గా ఉండేది అనే ఫీలింగ్ వచ్చేసింది. పూనమ్ తన పాత్రకు ఎదో న్యాయం చేసే ప్రయత్నం చేసింది. వరుసకు బావ అయ్యే నరేష్ ఇందులో సుధీర్ కు తండ్రి పాత్రలో నటించేసాడు. కానీ నరేష్, సుమన్ వంటి కొంత మంది తారాగణం వారి వారి పాత్రలకు న్యాయం చేయగలిగారు.

ఈ సినిమాలో సుధీర్ నటన, డాన్సులు, సిక్స్ ప్యాక్ బాడీ బాగున్నాయి. పాటలు పరవాలేదనిపించింది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ పూర్తిగా ఫెయిల్ అయ్యింది. మొత్తానికి ఈ సినిమా అనుకున్న స్థాయిలో లేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .