English | Telugu

అసెంబ్లీలో హిట్ పెయిర్



రోజా, బాలకృష్ణ వీరిద్దరూ అరడజను సినిమాల్లో హీరో హీరోయిన్లుగా కనిపించిన వీరు ఈ రోజు సరికొత్త రీతిలో కలుసుకున్నారు. సినీరంగంలో ఒక వెలుగు వెలిగిన తర్వాత రోజా రాజకీయ ప్రవేశం చేసింది. తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయాలలోకి అడుగు పెట్టిన రోజా తెలుగు దేశం మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. తెలుగు దేశం పార్టీ నుంచి రాజీనామా చేసి తర్వాత కాంగ్రెసు పార్టీలోకి, ఆ పార్టీ నుంచి కూడా రాజీనామ చేసి వైకాపా లో చేరిన సంగతి తెలిసిందే. గతంలో 2 సార్లు ఎన్నికలలో ఓడిపోయిన రోజా ఈ సారి ఎన్నికలలో తిరుపతి, చంద్రగిరి నియోజక వర్గం నుంచి విజయం సాధించారు.


ఇదిలా వుండగా బాలకృష్ణ తెదేపా నుంచి తొలిసారి ఎన్నికలలో పోటీ చేసి హిందూపురం నియోజక వర్గం నుంచి ఎన్నికయ్యారు. బాలకృష్ణ, రోజా ఇద్దరూ రాయలసీమ ప్రాంతం నుంచి విజయం సాధించడం మరొక విశేషం. గతంలో సినీ పరిశ్రమలో హీరోహీరోయిన్లుగా తారసపడిన వీరిద్దరూ ఇక నుంచి ఎమ్మెల్యేలుగా శాసనసభలో ఎదురుపడ్డారు. ఇంతకు ముందు ఎన్నో సినిమాలలో డ్యూయెట్లు పాడుతూ కనిపించిన ఈ తారలు, ఈ రోజు దైవసాక్షిగా అంటు ఆంధ్రశాసన సభలో ప్రమాణ స్వీకారం చేస్తూ టీవీల్లో కనిపించారు. సినిమాల్లో జంటగా కనిపించిన వీరు ఇప్పుడు ఉప్పునిప్పులా కస్సుబుస్సుమనే అధికార, ప్రతిపక్షాలకు చెందినవారు. ఇది అన్నిటి కంటే ఆసక్తికర విషయం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.