English | Telugu

అఖిల్ ఎందుకు సారీ చెప్పాడు ?


అఖిల్ చూడటానికి క్యూట్‌గా కనిపించడమే కాదు, అతని పనులు కూడా స్వీట్‌గా వున్నాయి. ఈ సిసీంద్రి హీరోగా పరిచయమవబోతున్నాడు అని "మనం " సినిమా విడుదల తర్వాత విస్తృతంగా ప్రచారం జరిగింది. దానికి స్పందిస్తు ఇరవై రోజుల్లో సినిమా వివరాలు తెలియచేస్తానంటూ ప్రకటించాడు అఖిల్. ఈ ప్రకటన చేసి దాదాపు నెల రోజులు అవుతోంది. సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచుస్తున్న అభిమానులు డిసప్పాయింట్ అయి వుంటారని అఖిల్ అర్థం చేసుకుని వారిని ఉద్దేశ్యించి ట్వీట్ చేశాడు.



అనుకున్న సమయానికి తన మొదటి సినిమా గురించి చెప్పలేక పోయినందుకు క్షమించండి అని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఆలస్యమవడం తనకు నచ్చట్లేదని, కానీ సినిమా ఓకే చెయ్యాలంటే చాలా విషయాలు ప్రిపేర్ కావల్సి వుంటుంది, అందువల్లే ఈ ఆలస్యం జరుగుతోందని, ఉద్దేశ్య పూర్వకంగా కాదంటూ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేశాడు ఈ క్యూట్ బాయ్. సినిమాల్లోకి రాక ముందే అభిమానుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని, ఎంతో రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తున్నాడు ఈ అక్కినేని బుల్లోడు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.