English | Telugu

69వ నేషనల్ ఫిల్మ్‌ అవార్డ్స్ .. విజేతలు వీరే!

మూవీ లవర్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నేషనల్ ఫిలిం అవార్డ్స్‌ (69th National Film Awards 2023)ఈవెంట్‌ మొదలైంది.. 2021 ఏడాదికి గానూ చలనచిత్ర జాతీయ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 69వ జాతీయ అవార్డులను జ్యూరీ సభ్యులు చదివి వినిపించారు.

ఉత్తమ ఫీచర్ ఫిల్మ్: రాకెట్రీ
ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్, (గోదావరి - మరాఠీ)
సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: RRR
నేషనల్ ఇంటిగ్రేషన్: ది కాశ్మీర్ ఫైల్స్‌పై ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా నర్గీస్ దత్ అవార్డు
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్(పుష్ప)
ఉత్తమ నటి: అలియా భట్ (గంగూబాయి కతియావాడి) మరియు కృతి సనన్ (మిమీ)
ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠి (మిమీ)
ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ది కాశ్మీరీ ఫైల్స్)
ఉత్తమ స్క్రీన్ ప్లే (ఒరిజినల్): నాయట్టు
ఉత్తమ స్క్రీన్ ప్లే (అడాప్టెడ్): గంగూబాయి కతియావాడి
ఉత్తమ సంగీత దర్శకత్వం (పాటలు): దేవిశ్రీ ప్రసాద్(పుష్ప)
ఉత్తమ సంగీత దర్శకత్వం (నేపథ్య సంగీతం): కీరవాణి (ఆర్ ఆర్ ఆర్)
ఉత్తమ నేపథ్య గాయకుడు: RRR
ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్ (ఇరవిన్ నిళళ్ - మాయావా ఛాయావా)
ఉత్తమ సాహిత్యం: చంద్రబోస్ (కొండ పొలం - ధమ్ ధమ్ ధమ్ పాట)
ఉత్తమ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనర్):అనీష్ బసు (చైవిట్టు - మలయాళం)
ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్ (RRR)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: అవిక్ ముఖోపాధ్యాయ్ (సర్దార్ ఉద్ధమ్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: వీర్ కపూర్ (సర్దార్ ఉద్దమ్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: సర్దార్ ఉదమ్
ఉత్తమ ఎడిటింగ్: గంగూబాయి కతియావాడి
బెస్ట్ మేకప్: ప్రీతి శీల్ సింగ్ డిసౌజా (గంగూబాయి కతియావాడి)
ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ: కింగ్ సాలమన్ (RRR)
ఉత్తమ హిందీ చిత్రం: సర్దార్ ఉదమ్
ఉత్తమ కన్నడ చిత్రం: 777 చార్లీ
ఉత్తమ మలయాళ చిత్రం: హోమ్
ఉత్తమ గుజరాతీ చిత్రం: ఛెలో షో
ఉత్తమ తమిళ చిత్రం: కడైసి వివాహాయి
ఉత్తమ తెలుగు చిత్రం: ఉప్పెన
ఉత్తమ బెంగాలీ చిత్రం: కల్‌కోఖో
ఉత్తమ అస్సామీ చిత్రం: అనూర్
ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: భావిన్ రబారి (ఛల్లో షో గుజరాతి)

నాన్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్స్
ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్ - ఏక్ థా గావ్ (గర్హ్వాలి & హిందీ)
ఉత్తమ దర్శకుడు - స్మైల్ ప్లీజ్ (హిందీ) చిత్రానికి బకువల్ మతియాని
కుటుంబ విలువలపై ఉత్తమ చిత్రం - చాంద్ సాన్సే (హిందీ)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - బిట్టు రావత్ (పాతాల్ టీ (భోటియా)
ఉత్తమ పరిశోధనాత్మక చిత్రం – లుకింగ్ ఫర్ చలాన్ (ఇంగ్లీష్)
ఉత్తమ విద్యా చిత్రం - సిర్పిగలిన్ సిపంగల్ (తమిళం)
సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రం - మిథు ది (ఇంగ్లీష్), త్రీ టూ వన్ (మరాఠీ & హిందీ)
ఉత్తమ పర్యావరణ చిత్రాలు – మున్నం వలవు (మలయాళం)
సినిమాపై ఉత్తమ పుస్తకం: లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం: రాజీవ్ విజయకర్ రచించిన ది ఇన్‌క్రెడిబ్లీ మెలోడియస్ జర్నీ
ఉత్తమ సినీ విమర్శకుడు: పురుషోత్తమా చార్యులు
ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ (ప్రత్యేక ప్రస్తావన): సుబ్రమణ్య బందూర్

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.