English | Telugu

ఐటమ్‌ సాంగ్‌కి 5 కోట్లు.. ఆ టాలీవుడ్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?

సినిమాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ అనేవి ప్రేక్షకులకు రిలీఫ్‌నిస్తాయి. ఒకప్పుడు ఈ తరహా పాటల కోసం ప్రత్యేకంగా నటీమణులు ఉండేవారు. ఆ తర్వాతి కాలంలో వారి హవా తగ్గింది. హీరోయిన్లుగా కొనసాగుతున్న వారితోనే ఐటమ్‌ సాంగ్స్‌ కూడా చేయించే కల్చర్‌ పెరిగింది. అందులో భాగంగానే ఎంతో మంది టాప్‌ హీరోయిన్లు ఏదో ఒక సందర్భంలో ఐటమ్స్‌ చేస్తూ వస్తున్నారు. అలా ఐటమ్‌ సాంగ్స్‌తో పాపులర్‌ అయిన టాలీవుడ్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే.


ఒరిజినల్‌గా కర్ణాటకలోని ఉడిపికి చెందిన పూజా ఫ్యామిలీ ముంబాయిలో స్థిరపడింది. ముంబైలోనే జన్మించిన పూజా.. ఓ తమిళ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమై, ఒక లైలా కోసం చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులోనే హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. నాలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన తర్వాత 'రంగస్థలం' చిత్రంలో 'జిగేలు రాణీ..' పాటతో ఐటమ్‌ గర్ల్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత హీరోయిన్‌గా నటిస్తూనే అవకాశం చిక్కినప్పుడల్లా ఐటమ్‌ సాంగ్స్‌ చేస్తోంది.


ఈ ఏడాది రజినీకాంత్‌ హీరోగా నటించిన 'కూలీ' చిత్రంలో 'మోనికా..' అనే స్పెషల్‌ సాంగ్‌లో కుర్రకారుకు పిచ్చెక్కించే స్టెప్స్‌ వేసి మరోసారి ఐటమ్‌ గర్ల్‌గా తన సత్తా చాటింది. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్న పూజా హెగ్డే.. మరో స్పెషల్‌ సాంగ్‌కి గ్రీన్‌ సిగల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.


అల్లు అర్జున్‌, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌ కోసం పూజాను ఫైనల్‌ చేశారని తెలుస్తోంది. ఈ సాంగ్‌ కోసం ఆమెకు 5 కోట్లు ఆఫర్‌ చేశారని సమాచారం. ఇప్పటివరకు ఒక స్పెషల్‌ సాంగ్‌ కోసం ఇంతటి ఆఫర్‌ ఏ హీరోయిన్‌కీ దక్కలేదు. దీన్ని బట్టి పూజాకి ఎంత డిమాండ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక సందర్భంలో హీరోయిన్‌గా వెనకబడినా నిలదొక్కుకొని అవకాశాలు అంది పుచ్చుకుంటోంది. ఒక్క ఐటమ్‌ సాంగ్‌కి 5 కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న పూజా.. రానున్న రోజుల్లో మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .