తీసుకున్న రెమ్యునరేషన్స్ ఇవేనా!. ప్రస్తుత టాక్ ఎలా ఉంది
నువ్వు ఎదుటి వాళ్ళ జీవితం విషయంలో ఎన్ని నాటకాలు చేసినా విధాత రాసే విధి ముందు.. నువ్వెంత.. నీ స్థాయి ఎంత.. జుజుబీ.. అనే వైఫ్ అండ్ హజ్బండ్ కాన్సెప్ట్ తో కూడిన లైన్ కి ఎంటర్ టైన్ మెంట్ కోణాన్ని జోడించి చెప్పిన చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు'. ఎలాంటి ఆర్బాటాలకి పోకుండా సమాజంలో నిత్యం మనుషుల మధ్య మెదులుతు ఉండే ప్రేమ, పంతాలు, కోపాలు, ఈర్ష్య, ఆనందం, అనురాగం,ఆప్యాయత,భావోద్వేగాల్ని ప్రధాన ఎలిమెంట్స్ గా చెప్పడంతో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతున్నారు.