English | Telugu

‘మన మెగాస్టార్‌ చిరంజీవిగారు’ ఇలా ఉంటే చాలంటున్న ఫ్యాన్స్‌!

మెగాస్టార్‌ చిరంజీవి అంటే యాక్షన్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అని చెప్పాలి. ఒకప్పుడు తన యాక్షన్‌తో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఉర్రూతలూగించారు. ఇటీవలి కాలంలో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ అందర్నీ అలరిస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవిని హీరోగానే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకే అడపా దడపా తండ్రి క్యారెక్టర్స్‌ చేసినప్పటికీ ఆడియన్స్‌ వాటిని తిప్పికొట్టారు. అందుకే ఇప్పటికీ హీరోగానే కొనసాగుతున్నారు చిరంజీవి.

ప్రస్తుతం చిరంజీవి వయసు రీత్యా యాక్షన్‌, కుర్రకారుకు హుషారెక్కించే డాన్సులతో సినిమాలు చేయడం కష్టం. అయినప్పటికీ మెగాస్టార్‌ అనే స్టేటస్‌ ఏమాత్రం తగ్గకుండా ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఆకట్టుకునేలా ఒక డిఫరెంట్‌ క్యారెక్టర్‌ను మెగాస్టార్‌ కోసం క్రియేట్‌ చేశారు అనిల్‌ రావిపూడి. అలా పుట్టిందే ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రం. అనిల్‌ చేసిన ఈ ఎక్స్‌పెరిమెంట్‌ను ప్రేక్షకులు, అభిమానులు యాక్సెప్ట్‌ చేశారని చెప్పాలి.

మెగాస్టార్‌ కంబ్యాక్‌ మూవీగా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రానికి సంబంధించి ప్రీమియర్ల నుంచి రెగ్యులర్‌ షోల వరకు ఎంతో సందడిగా జరుగుతున్నాయి. కొత్తగా కనిపిస్తున్న మెగాస్టార్‌ను చూసేందుకు ఆడియన్స్‌ థియేటర్లకు తరలివస్తున్నారు. అయితే ఈ సినిమాలో కథగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేకపోయినా మెగాస్టార్‌ చిరంజీవిని ఆడియన్స్‌ ముచ్చటగా చూసి ఎంజాయ్‌ చేస్తున్నారు ఆడియన్స్‌. గతంలో వచ్చిన కొన్ని సినిమాల రిఫరెన్సులు ఈ సినిమాలో ఉపయోగించడం ఆడియన్స్‌కి పెద్ద రిలీఫ్‌నిచ్చింది.

అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రంలో చిరంజీవి మందు తాగొచ్చి శశిరేఖగా నటించిన విజయశాంతిని టీజ్‌ చేసే సన్నివేశాన్ని గుర్తు చేసే సీన్‌ ఈ సినిమాలో కూడా ఉపయోగించారు. ఆడియన్స్‌ దాన్ని బాగా ఎంజాయ్‌ చేశారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో హీరోయిన్‌ పేరు కూడా శశిరేఖ కావడం విశేషం. అలాగే చంటబ్బాయ్‌ చిత్రంలో సుహాసిని క్యారెక్టర్‌ పేరు జ్వాలను ఈ సినిమాలో కేథరిన్‌ కోసం ఉపయోగించారు. వాటిని కూడా ప్రేక్షకులు బాగా రిసీవ్‌ చేసుకున్నారు.

కొన్ని పాత సినిమాల్లోని సన్నివేశాలను ఈ సినిమాలో రిపీట్‌ చేసినప్పటికీ ప్రేక్షకులు వాటిని చక్కని మెమరీస్‌గా తీసుకొని ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే ఎక్కడా పాత సినిమాలను రిపీట్‌ చేసిన ఫీలింగ్‌ రాకుండా అనిల్‌ రావిపూడి జాగ్రత్తలు తీసుకున్నారు. చిరంజీవి అంటే భారీ యాక్షన్‌ సీన్స్‌, అదిరిపోయే డాన్సులు అనే విషయాలను పక్కన పెట్టి ప్రేక్షకుల్ని చక్కని మూడ్‌లోకి తీసుకెళ్ళేందుకు అనిల్‌ రావిపూడి చేసిన ప్రయత్నాన్ని అందరూ ఆమోదిస్తున్నారు.

స్పోర్ట్స్‌లో ఎంతో ప్రతిభ కలిగిన అమ్మాయిని తనకు సంబంధం లేకపోయినా ఎంతో కృషి చేసి ఆమెను ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన క్యారెక్టర్‌ను అశ్వని చిత్రంలో భానుచందర్‌ చేశారు. ఆ తరహా క్యారెక్టర్‌ను భగవంత్‌ కేసరి చిత్రంలో నందమూరి బాలకృష్ణ పోషించారు. అలాంటి సన్నివేశాలు ఈ సినిమాలో కూడా ఉన్నాయి. అయితే అలాంటివి ఇంతకుముందే చూసేశాం కదా అనే ఆలోచన ప్రేక్షకుల మనసుల్లోకి రాకుండా ఎంతో వైవిధ్యంగా ప్రతి సన్నివేశాన్ని డిజైన్‌ చేశారు అనిల్‌. ఏది ఏమైనా మునుపటి మెగాస్టార్‌ చిరంజీవిని మరోసారి వెండితెరపై ఆవిష్కరించి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించడంలో డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యారని చెప్పాలి. ఇకపై ‘మన మెగాస్టార్‌ చిరంజీవిగారు’ ఇలా స్క్రీన్‌పై కనిపిస్తే చాలు.. బోలెడంత ఎంటర్‌టైన్‌మెంట్‌ పక్కా అని ప్రేక్షకులు, అభిమానులు ముక్త కంఠంతో చెబుతున్నారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.