రావిపూడికి సంక్రాంతి.. అబ్బవరంకి దీపావళి...
సినీ పరిశ్రమలో సెంటిమెంట్ లు ఎక్కువ. దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతి సెంటిమెంట్ కూడా అలాంటిదే. ఆయన దర్శకత్వంలో రూపొందిన 'F2', 'సరిలేరు నీకెవ్వరు', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించాయి. ఆయన నెక్స్ట్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు' కూడా 2026 సంక్రాంతికి విడుదల కానుంది.