English | Telugu
పవన్ పాత్రలో అపరిచితుడు
Updated : Mar 19, 2014
హిందీలో ఘనవిజయం సాధించిన "ఓ మై గాడ్" చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. మోడ్రన్ కృష్ణుడి పాత్రలో పవన్ కళ్యాణ్, మధ్య తరగతి మనిషి పాత్రలో వెంకటేష్ నటించబోతున్నారు. ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కానీ ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే పవన్ రాజకీయాల్లోకి వెళ్ళడంతో ఈ సినిమా మధ్యంతరంగా ఆపివేయల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ చిత్ర నిర్మాతలు మాత్రం మరో ఆప్షన్ కోసం వెతుకుతున్నారు. పవన్ డేట్స్ ఖాళీ లేకపోతే పవన్ స్థానంలో నటుడు విక్రమ్ ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.
తెలుగులో "అపరిచితుడు", "మల్లన్న" వంటి తదితర చిత్రాలతో విక్రమ్ మంచి మార్కెట్ ను సంపాదించుకున్నాడు. అందుకే ఈ సినిమాలో విక్రమ్ ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలిసింది. సురేష్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లలో సురేష్ బాబు, శరత్ మరార్ లు సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి పవన్ డేట్స్ ఎలాగైనా సర్దుబాటు చేసి ఈ సినిమాలో నటిస్తాడో లేక ఈ సినిమాను వదులుకుంటాడో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.