English | Telugu

పూరితో వరుణ్ మూవీ!!

మెగా హీరో వ‌రుణ్ తేజ్ నటించిన మొదటి సినిమా 'ముకుంద' రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సినిమా తరువాత ఆయన చేయబోయే తరువాతి సినిమాలపైన కూడా వరుణ్ క్లారిటీ ఇచ్చాడు. ‘ముకుంద’ తరువాత పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నటించబోతున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు తెలిపాడు. అలాగే ఈ సినిమా తరువాత వేదం దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో చేస్తాడట. క్రిష్ ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘గబ్బర్‌’ సినిమాతో బిజీగా వున్నాడు. ఈ సినిమా తరువాత వరుణ్‌తేజ్‌ సినిమా మొదలుపెడతాడట. మొత్తానికి వరుణ్‌ 2015 సంవత్సరంలో రెండు లేదా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.