English | Telugu

కృష్ణవంశీకి తమన్నా గ్రీన్ సిగ్నల్

‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంతో ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయిన కృష్ణవంశీ, స్టార్ హీరోలతో కాకుండా కొత్త వాళ్ళతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడట. దీనికి సంబంధించిన స్టొరీ లైన్ ను విన్న నిర్మాత దిల్ రాజు, నటుడు ప్రకాష్ రాజ్ ఈ చిత్రాన్ని తామే నిర్మిస్తామని ముందుకు వచ్చారట. అలాగే ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర చేయడానికి తమన్నా అంగీకరించినట్టు లేటెస్ట్‌ న్యూస్‌. తమన్నాది ఇందులో ప్రధాన పాత్ర అని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయిన తరువాత కొత్త నటీనటులను ఎంపిక చేసి, సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నట్లు సమాచారం.