English | Telugu
వరుణ్ సందేశ్, శ్రద్ధా దాస్ పెళ్ళి...
Updated : Mar 26, 2011
శ్రద్ధా దాస్, వరుణ్ సందేశ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారని ఫిలిం నగర్ లో రూమర్లు షికార్లు చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే ప్రముఖ యువ హీరో వరుణ్ సందేశ్, అలాగే ప్రముఖ హీరోయిన్ శ్రద్ధా దాస్ ఇద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటూ ఉన్నారు. వీరి ప్రేమ వ్యవహారం బయటపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారట. కానీ శ్రద్ధా దాస్, వరుణ్ సందేశ్ ల ప్రేమ వ్యవహారం వరుణ్ సందేశ్ తండ్రికి సుతరామూ ఇష్టం లేదట. దాంతో శ్రద్ధా దాస్ కి ఆయన " నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. అంతేకానీ మా అబ్బాయి జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు"అని ఘాటుగా వార్నింగ్ కూడా ఇచ్చాడట.
వరుణ్ సందేశ్ తండ్రికి తెలియని విషయం ఏమిటంటే వరుణ్ సందేశ్, శ్రద్ధా దాస్ ఇద్దరూ కలసి బంజారా హిల్స్ లోని ఎబోనీ అనే హోటల్లో ఒకే రూమ్ లో కలిసుంటున్నారట. ఫిలిం నగర్ జనాల కథనం ప్రకారం త్వరలో వరుణ్ సందేశం, శ్రద్ధా దాస్ ఇద్దరూ రహస్యంగా లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారనేది సమాచారం. ప్రతీ ప్రేమ వ్యవహారం బయటపడే వరకూ గుట్టుగానే ఉంటుంది. అలాగే వరుణ్ సందేశ్, శ్రద్ధా దాస్ ల ప్రేమ వ్యవహారం, వెడ్డింగ్ కూడా అంతేగా....