English | Telugu
కృష్ణుడు సరసన ఛార్మి
Updated : Mar 26, 2011
కృష్ణుడు సరసన ఛార్మి హీరోయిన్ గా నటించటానికి అంగీకరించిందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఛార్మి పెద్ద హీరోల సరసన భవిష్యత్తులో నటించే అవకాశం కనిపించటం లేదు. కారణాలు తెలియవు కానీ ఆమె ఫస్ట్ గ్రేడ్ హీరోయిన్ స్థాయి నుండి అంచెలంచెలుగా దిగజారుతూ ప్రస్తుతం కృష్ణుడు దగ్గర ఆగింది. గతంలో ప్రముఖ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కూడా అగ్ర హీరోలందరి సరసనా నటించి, అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి చివరికి ఊరూ పేరూ లేని పిచ్చి సినిమాల్లో నటించే స్థాయికి ఆమె పరిస్థితి దిగజారిపోయింది.
ప్రస్తుతం ఛార్మి పరిస్థితి కూడా ఇందుకు ఏమాత్రం భిన్నంగా లేదు. ఇక ఈ చిత్రం వివరాల్లోకి వెళితే కృష్ణుడు బండ మొగుడు గానూ, అతని అందమైన బందరు లడ్డూలాంటి భార్యగా ఛార్మి ఒక చిత్రంలో నటించబోతున్నారట. కృష్ణుడు ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ తో బాధపడే భర్త పాత్రలో నటిస్తూండగా, అతన్ని అర్థం చేసుకునే అందమైన భార్యగా ఛార్మి నటిస్తూందట ఈ చిత్రంలో.ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.