English | Telugu

కమల్ 'థగ్ లైఫ్'లో టాలీవుడ్ స్టార్!

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తన 234వ సినిమా 'థగ్ లైఫ్'ని ప్రముఖ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. రాజ్ కమల్ ఫిలిమ్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ అనౌన్స్ మెంట్ వీడియో ఇటీవల విడుదలై ఆకట్టుకుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో దుల్కర్ సల్మాన్, జయం రవి, త్రిష ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇందులో ఓ టాలీవుడ్ స్టార్ కూడా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

'థగ్ లైఫ్'లో పలు కీలక పాత్రలు ఉన్నాయట. ఆ పాత్రల కోసం యంగ్ స్టార్స్ ని రంగంలోకి దింపాలని మణిరత్నం చూస్తున్నారట. ఇప్పటికే మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రాజెక్ట్ లో భాగమయ్యాడు. అలాగే మరో కీ రోల్ కోసం మొదట తమిళ్ స్టార్ కార్తి పేరు పరిశీలించారట. కానీ తెలుగు స్టార్ అయితే కొత్తగా ఉంటుందని, పైగా తెలుగునాట బిజినెస్ కూడా ఎక్కువగా జరుగుతుందని భావిస్తున్నారట. అందుకే ప్రస్తుతం మణిరత్నం చూపు టాలీవుడ్ స్టార్స్ మీద పడిందని అంటున్నారు. ప్రముఖంగా నేచురల్ స్టార్ నాని పేరు వినిపిస్తోంది. మరి నాని లేదా టాలీవుడ్ కి చెందిన మరో హీరో ఎవరైనా కమల్ 'థగ్ లైఫ్'లో భాగమవుతారేమో చూడాలి.