English | Telugu
షాకింగ్.. ప్రభాస్ మూవీ రీ షూట్.. మళ్ళీ మొదటి నుంచి..!
Updated : Apr 8, 2024
'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన ప్రభాస్(Prabhas).. అప్పటి నుంచి భారీ సినిమాలే చేస్తున్నాడు. తాను చేస్తున్నవన్నీ భారీ సినిమాలు కావడంతో పలు కారణాల వల్ల విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. అయితే ఈ భారీ సినిమాల నడుమ మారుతీ దర్శకత్వంలో 'ది రాజా సాబ్'(The Raja Saab) అనే హారర్ ఫిల్మ్ ని ప్రకటించి సర్ ప్రైజ్ చేశాడు ప్రభాస్. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది.
ఈ ఏడాది సంక్రాంతికి 'ది రాజా సాబ్' ఫస్ట్ లుక్ విడుదల కాగా, మిశ్రమ స్పందన లభించింది. కొందరు వింటేజ్ ప్రభాస్ అంటూ మురిసిపోగా, మరికొందరు మాత్రం ప్రభాస్ స్థాయికి తగ్గట్టుగా పోస్టర్ లేదని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో మూవీ టీం.. ఇప్పటిదాకా షూట్ చేసిన రష్ ను రీ చెక్ చేసుకొని, షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న 'ది రాజా సాబ్' ఇప్పటిదాకా దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. అయితే ఫస్ట్ లుక్ కి వచ్చిన రెస్పాన్స్ తర్వాత, అవుట్ పుట్ ని పదే పదే రీ చెక్ చేసుకున్న మేకర్స్.. షూట్ చేసిన దానిలో చాలావరకు రష్ ని పక్కన పెట్టి, రీ షూట్ చేయాలని నిర్ణయించుకున్నారట. ముఖ్యంగా ప్రభాస్ ఉన్న కీలక సన్నివేశాలను రీ షూట్ చేయనున్నట్లు ఇండస్ట్రీ సర్కిల్స్ లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ.. దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తయిన మూవీ.. రీ షూట్ కి వెళ్తుందనే న్యూస్ మాత్రం షాక్ కి గురి చేస్తోంది.
ఈ వార్త నిజమైతే మాత్రం.. వింటేజ్ ప్రభాస్ ని ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూస్తామా అని ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి నిరాశ తప్పదు. ఎందుకంటే త్వరలో 'కల్కి 2898 AD'తో ప్రేక్షకులను పలకరించనున్న ప్రభాస్ చేతిలో.. 'సలార్-2', 'స్పిరిట్' వంటి భారీ సినిమాలు ఉన్నాయి. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలోనూ ఓ భారీ పీరియాడికల్ యాక్షన్ మూవీ చేయనున్నాడు. ఈ భారీ సినిమాల నడుమ.. 'ది రాజా సాబ్' లాంటి హారర్ ఫిల్మ్ కి, అందునా రీ షూట్ కోసం ప్రభాస్ సమయం కేటాయించడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఈ లెక్కన 'రాజా సాబ్' మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని, విడుదల కావాలంటే చాలా ఆలస్యమయ్యే అవకాశముంది.