English | Telugu

ఆ ఇద్దరికీ ప్రేమించుకోవడానికే టైమ్‌ సరిపోవడం లేదట.. అందుకే అలా!

ప్రేమలు, సహజీవనాలు, పెళ్లిళ్లు, విడాకులు అనేవి సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణం అయిపోయాయి. ఇటీవలికాలంలో చాలా మంది హీరోయిన్లు పెళ్లి బాట పట్టారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, అక్ష, కృతి కర్బందా, సోనారికా, మీరా చోప్రా.. వీళ్లంతా మూడు ముళ్ళ బంధంతో వైవాహిక జీవితంలోకి ఎంటర్‌ అయిపోయారు. లిస్ట్‌లో నెక్స్‌ట్‌ వినిపిస్తున్న పేరు తమన్నాది. బాలీవుడ్‌ హీరో విజయ్‌వర్మతో తమన్నా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన విషయం తెలిసిందే. త్వరలోనే తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా తమన్నా ప్రకటించింది. అయితే అది ఎప్పుడు అనేది మాత్రం తాను చెప్పలేనని కూడా తెలియజేసింది. 

తాజాగా అందుతున్న సమాచారం మేరకు తమన్నా, విజయ్‌వర్మ పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈమధ్యకాలంలో సినీ జంటలు డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ జంట కూడా అదే దారిలో వెళ్ళేందుకు రెడీ అవుతున్నారు. డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌ కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇండియాలోనే చాలా ప్రదేశాలు ఉన్నాయని, అక్కడే వారు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ప్రధాని మోడి ప్రకటించిన తర్వాత కొందరు విదేశాల్లో ప్లాన్‌ చేసుకున్న పెళ్లిళ్లను కూడా క్యాన్సిల్‌ చేసుకొని ఇండియాలోనే చేసుకున్నారు. ఇప్పుడు తమన్నా, విజయ్‌ కూడా ఇండియాలోనే పెళ్ళి చేసుకోవాలని డిసైడ్‌ అయ్యారట. ప్రస్తుతం వేదిక కోసం సెర్చింగ్‌ మొదలుపెట్టారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. పెళ్ళిని చాలా రోజుల నుంచి వాయిదా వేస్తూ వస్తున్న ఈ ఇద్దరూ ప్రస్తుతం సహజీవనంలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఇది నిజమేనన్నట్టు ముంబాయిలో వీరిద్దరూ ఒకే ఫ్లాట్‌లో కలిసి ఉంటున్నారు. దాని వల్ల టైమ్‌ సేవ్‌ అవుతోందని వారు భావిస్తున్నారని తెలుస్తోంది. తమన్నా, విజయ్‌ తమతమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తమన్నా విషయానికి వస్తే బాలీవుడ్‌తోపాటు సౌత్‌ లాంగ్వేజెస్‌లో కూడా సినిమాలు చేస్తోంది. దీంతో ఇద్దరికీ ప్రేమించుకోవడానికి టైమ్‌ సరిపోవడం లేదట. దానికోసం కొంత సమయం వెచ్చించాల్సి వస్తోందన్న ఉద్దేశంతో ఇద్దరూ కలిసి ఒకే ఫ్లాట్‌లో ఉంటున్నారని బాలీవుడ్‌ మీడియా ప్రచారం చేస్తోంది.