Read more!

English | Telugu

నాగార్జున గారూ...ఇంకెవ్వరూ దొరకలేదా..!

అక్కినేని అఖిల్ అరంగేట్రం చేయబోయే సినిమాపై అభిమానులలో భారీ అంచనాలున్నాయి. కానీ లేటెస్ట్ గా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న వార్తపై మాత్రం అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఆ వార్త ఏమిటంటే అఖిల్ అరంగేట్రం చేసే సినిమాకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికయ్యాడట. ఈ వార్తను మాత్రం అక్కినేని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. టాలీవుడ్ లో సినిమా త్వరగా ఫినిష్ చేయాలని దర్శకులు థమన్ ని తీసుకుంటువుంటారు. మరి అఖిల్ అరంగేట్రం సినిమా కోసం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్న నాగార్జున థమన్ విషయంలో ఎందుకు తొందరపడుతారు? అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. నాగ్ టెస్ట్ ప్రకారం ఈ సినిమా దేవిశ్రీ లేదా అనూప్ రూబెన్స్ తీసుకొనే అవకాశం వుందని మరికొంతమంది అంటున్నారు. అభిమానులలో ఇలాంటి గందరగోళం నెలకొనకుండా వుండాలంటే నాగార్జున అఖిల్ అరంగేట్రంపై త్వరగా క్లారిటీ ఇస్తే బాగుంటుంది.