English | Telugu

ఘోరమైన ఫ్లాపునుంచి తప్పుకున్న మహేష్ బాబు

ఘోరమైన ఫ్లాపునుంచి తప్పుకున్న మహేష్ బాబు అని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే ఇటీవల వైజయంతీ మూవీస్ పతాకంపై, యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా, మెహెర్ రమేష్ దర్శకత్వంలో, అశ్వనీ దత్ నిర్మించగా విడుదలైన చిత్రం "శక్తి". ఈ "శక్తి" సినిమాలో అస్సలు శక్తే లేదనీ జనం దారుణంగా తిరగ్గొడుతున్నారు. ఈ "శక్తి" చిత్రం యన్ టి ఆర్ కి మరో "ఆంధ్రావాలా", మరో "నరసింహుడు"లాగా ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.

దీనికీ మహేష్ బాబుకీ సంబంధం ఏమిటంటే ఓ రెండేళ్ళ క్రితం ఈ "శక్తి" చిత్రం స్క్రిప్ట్ ని మెహెర్ రమేష్ ముందుగా మహేష్ బాబుకే ముందుగా చెప్పాడట. ఈ "శక్తి" కథ వినగానే మహేష్ బాబు "ఈ కథ కాదుగానీ మరో మంచి కథేదన్నా ఉంటే తీసుకురా" అన్నాడట. ఆ తర్వాత మెహెర్ రమేష్ గాలానికి పాపం జూనియర్ యన్ టి ఆర్ చిక్కాడు. కథ విన్న వెంటనే తన అంగీకారం తెలిపిన యన్ టి ఆర్ ఆ సినిమాలో హీరోగా నటించటం, అది ఫ్లాప్ గా మిగలటం జరిగింది. నిజానికి ఈ "శక్తి" చిత్రం రాజమౌళి "మగధీర" చిత్రం రికార్డుల్ని క్రాస్ చేస్తుందన్న స్థాయిలో బిల్డప్పిచ్చారు. కానీ ఆ తర్వాత ఏమయిందో ప్రేక్షకులకు తెలిసిందే.