English | Telugu

పూరీ బిజినెస్ మేన్ లో అభిషేక్

పూరీ "బిజినెస్ మేన్" లో అభిషేక్ బచ్చన్ నటించనున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ప్రముఖ దర్శక, నిర్మాత పూరీ జగన్నాథ్ త్వరలో తీయబోయే "ది బిజినెస్ మేన్" సినిమా హిందీ వెర్షన్ లో ప్రముఖ బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ హీరోగా నటించనున్నాడని బాలీవుడ్ వర్గాలంటున్నాయి. ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రథాన పాత్రలో నటిస్తూండగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, రామ్ గోపాల వర్మ సమర్పిస్తున్న చిత్రం "బుడ్డా".

ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సమయంలో అభిషేక్ బచ్చన్ కు పూరీ జగన్నాథ్ ఈ "ది బిజినెస్ మేన్" సినిమా కథను వినిపించారట. ఈ కథ వినగానే వేరే ఆలోచన లేకుండా ఈ సినిమాలో నటించటానికి అంగీకరించారట. ఇదే సినిమా తెలుగు వెర్షన్ లో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించటానికి ఇదివరకే అంగీకరించారు. గతంలో మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ లో వచ్చిన "పోకిరి" రికార్డులు సృష్టించింది. ఆ సినిమా తర్వాత వాళ్ళిద్దరూ కలసి పనిచేస్తున్న సినిమా ఇదే కావటం విశేషం.