English | Telugu
టాప్ హీరో సోదరి పునర్వివాహం
Updated : Aug 9, 2011
టాప్ హీరో సోదరి పునర్వివాహం చేసుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. గత ముప్పై సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా ఉండి, ఆ మధ్య ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించిన ఒక టాప్ హీరో సోదరి పునర్వివాహం చేసుకున్నారని తెలిసింది. ఆమె వయసు దాదాపు యాభై సంవత్సరాలట. ఇరవై సంవత్సరాల వయసున్న కుమారుడు కూడా ఆమెకున్నారనీ, అతను ప్రస్తుతం ఒక తెలుగు సినిమాలో హీరోగా కూడా నటిస్తున్నారని కూడా సమాచారం.
హై సొసైటీలో ఇలాంటివి మామూలేననీ, ఆమెకీ ఒక తోడు కావాలి కదా అంటూ సమర్థిస్తున్నారు...అదే మధ్య తరగతికి చెందిన సగటు స్త్రీ రెండో పెళ్ళి చేసుకుంటే వెటకారంగా మాట్లాడే ఈ సమాజం పెద్దింటి వారు రెండో పెళ్ళి చేసుకుంటే మాత్రం దాన్ని సమర్థిస్తుంది. మన సమాజంలో డబ్బున్నోళ్ళకీ లేనోళ్ళకీ తేడా అదే కదా....!