English | Telugu

యన్ టి ఆర్ కి పోటీ ఇస్తున్న అల్లు అర్జున్

యన్ టి ఆర్ కి పోటీ ఇస్తున్న అల్లు అర్జున్ అని ఫిలిం నగర్ లో ఘాటు చర్చజరుగుతోంది. ఇంతకి అల్లు అర్జున్ దేనిలో యన్ టి ఆర్ కి పోటీ ఇస్తున్నాడంటే డ్యాన్స్ లోనట. అల్లు అర్జున్ డ్యాన్సులో స్పీడ్, స్టైల్ ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అలాగే యన్ టి ఆర్ స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ గనుక సినిమా డ్యాన్సులు అతనికి నల్లేరు మీద నడకని చెప్పాలి. ఆ మధ్య యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచీ యన్ టి ఆర్ వెన్నెముకకు ఇబ్బంది కలుగని స్టెప్స్ మాత్రమే చేస్తున్నాడని, అలా డ్యాన్సులను కంపోజ్ చేయాల్సిందిగా కొరియోగ్రాఫర్లను ఆదేశిస్తున్నారని ఓ పుకారుంది.

 

అయితే అల్లు అర్జున్ "బద్రీనాథ్" సినిమాలో డ్యాన్స్ లు ఇరగ్గొట్టాడట. ఆ డ్యాన్సుల్లో తన శరీరాన్ని వెనక్కు బాగా వంచి మరీ డ్యాన్సు చేశాడట అల్లు అర్జున్. అటువంటి డ్యాన్సులు యాక్సిడెంట్ అయిన తర్వాత యన్ టి ఆర్ చేయలేడనీ, దీనివల్ల అల్లు అర్జున్ తో ఇక యన్ టి ఆర్ పోటీపడలేడనీ ఫిలిం నగర్ లో ఒక వర్గం అంటున్నారు. నాకయితే యన్ టి ఆర్ డ్యాన్సుల్లో తప్పకుండా అందరు హీరోలకూ గట్టిపోటీ ఇస్తాడని ఉంది. మరి మీరేమంటారు...?