English | Telugu

నాగచైతన్య ఆ రామ్ చరణ్ గండం దాటగలడా...?

నాగచైతన్య ఆ రామ్ చరణ్ గండం దాటగలడా...? అన్న ప్రశ్న ప్రస్తుతం సినీ పండితులకొస్తుంది. వివరాల్లోకి వెళితే గతంలో యువ హీరో రామ్ చరణ్ తేజకు ఏర్పడిన గండం ప్రస్తుతం నాగచైతన్యకు కూడా ఏర్పడే ప్రమాదముందనీ, మరి నాగచైతన్య ఆ గండాన్ని నిరపాయంగా దాటగలడా అని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. ఇంతకీ ఆ గండం విషయమేమిటంటే గతంలో రామ్ చరణ్ హీరోగా, జెనీలియా హీరోయిన్ గా, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నాగబాబు నిర్మించిన "ఆరెంజ్" చిత్రం ఆడియో రిలీజ్ సందర్భంలో హీరో రామ్ చరణ్ ఆ చిత్రం షూటింగ్ లో ఆస్ట్రేలియాలో ఉండటం వల్ల ఆడియో రిలీజ్ కు రాలేకపోయాడు.


అలాగే ఇటీవల నాగచైతన్య హీరోగా, తమన్నా హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో, బన్నీ వాసు నిర్మిస్తూన్న "100% లవ్" చిత్రం ఆడియో రిలీజ్ కు నాగచైతన్య రాలేదు. ఆ సమయంలో నాగచైతన్య కామాక్షీ కళా మూవీస్ బ్యానర్ పై, అజయ్ భూయాన్ దర్శకత్వంలో, నాగచైతన్య హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, డి.శివప్రసాద రెడ్డి నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ కోసం థాయ్ ల్యాండ్ లో ఉన్నాడు. రామ్ చరణ్ "ఆరెంజ్" ఆడియో రిలీజ్‍ లో అతని తండ్రి చిరంజీవి ఉంటే, నాగచైతన్య "100% లవ్" చిత్రం ఆడియో రిలీజ్ లో అతని తండ్రి అక్కినేని నాగార్జున ఉన్నాడు. ఈ పద్ధతిలో సెంటిమెంట్ పరంగా చూస్తే "100% లవ్" చిత్రమ కూడా "ఆరెంజ్" చిత్రంలా అడ్రస్ లేకుండా పోతుందా...? లేక ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి హిట్టవుతుందా అనేది ఏప్రెల్ 29 న గానీ తెలియదు.