English | Telugu

రవితేజ హీరోగా యుటివి మోషన్ పిక్చర్స్ చిత్రం

రవితేజ హీరోగా యుటివి మోషన్ పిక్చర్స్ వారు ఒక చిత్రం నిర్మించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న టి.వి. మరియూ సినీ నిర్మాణ సంస్థ వారు తెలుగు, తమిళ భాషల్లో కూడా సినిమాలు తీయటానికి సన్నాహాలు చేస్తున్నారు. యుటివి మోషన్ పిక్చర్స్ వారు ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే సినిమాలను నిర్మిస్తున్నారు.


అలాగే తెలుగు, తమిళ భాషల సినీ మార్కెట్ ను కూడా స్టడీ చేసి, ఇక్కడ కూడా మంచి లాభాలు గడించవచ్చనే ఉద్దేశంతో వారిక్కడ సినీ నిర్మాణానికి పూనుకున్నారు. ముందుగా తెలుగులో సినిమాలు తీయాలంటే తమకు అనుకూలమైన, నమ్మకంగా హిట్టివ్వగల మినిమమ్ గ్యారెంటీ హీరో ఎవరాని వారు విచారించగా, వారికి లభించిన తొలి పేరు మాస్ రాజా రవితేజ అట. అందుకని రవితేజనే హీరోగా పెట్టి ఒక సినిమాని తెలుగులో నిర్మించటానికి యుటివి మోషన్ పిక్చర్స్ సంస్థ వారు నిర్ణయించినట్టు సమాచారం.