English | Telugu
సుడిగాలి సుధీర్ తో మహేష్ బాబు డైరెక్టర్ మూవీ!
Updated : Dec 15, 2022
సుడిగాలి సుధీర్ ...తాను లేనిదే ఎంటర్టైన్మెంట్ షో లేదు అనేంత స్థాయికి ఎదిగాడు. ఇక బుల్లితెర మీద షోస్ చేస్తూ కొన్ని మూవీస్ లో అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ఇక రీసెంట్ "గాలోడు" మూవీ చేసి మంచి వసూళ్లను రాబట్టారు. దాంతో బుల్లితెరకు కొంచెం దూరం కావాల్సి వచ్చింది. ‘గాలోడు’ మూవీ ద్వారా బంపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు..ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర మంచి సక్సెస్ సాధించేసరికి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోయాయి. అలాగే మంచి వసూళ్లను రాబట్టేసరికి సుడిగాలి సుధీర్ కొంతమంది టాప్ డైరెక్టర్స్ , ప్రొడ్యూసర్స్ దృష్టిలో పడ్డాడు.
ఇక వాళ్ళు కూడా అతనితో సినిమా తీయడానికి రెడీ అవుతున్నారు. లేటెస్ట్ గా చూసుకుంటే ‘సోలో’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘గీత గోవిందం’,’సర్కారువారి పాట’ వంటి సూపర్ హిట్ మూవీస్ కి డైరెక్షన్ చేసిన పరశురాం సుడిగాలి సుధీర్ తో ఒక మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది..రీసెంట్ గానే ఆయన సుధీర్ తో ఈ విషయం పై చర్చించినట్టు తెలుస్తోంది.. సుధీర్ తో మంచి సబ్జెక్టు ఉన్న స్టోరీ గనక తీస్తే డెఫినిట్ గా మంచి కమర్షియల్ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.