English | Telugu

భూమా మౌనికతో మంచు మనోజ్ పెళ్లి ఫిక్స్?

 

మంచు మనోజ్ పెళ్లి వార్త మరోసారి హెడ్‌లైన్స్‌లోకి ఎక్కింది. ఆమధ్య దివంగత భూమా నాగిరెడ్డి, శోభారెడ్డి దంపతుల చిన్న కుమార్తె మౌనికారెడ్డితో మనోజ్ సన్నిహితంగా మెలగుతున్నాడనీ, త్వరలో వారు పెళ్లి చేసుకొనే అవకాశం ఉందనీ ప్రచారంలోకి వచ్చింది. గతంలో ప్రణతి అనే యువతిని ప్రేమించి పెళ్లాడాడు మనోజ్. కానీ రెండేళ్లకే వారి మధ్య బంధం విడాకులతో చెదిరిపోయింది. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో ఇరువురూ విడిపోయారు. 

కొన్ని రోజుల క్రితం భూమా మౌనికతో మనోజ్ కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. అప్పుడు హైదరాబాద్‌లోని గణేశ్ మంటపానికి ఆ ఇద్దరూ కలిసి రావడంతో ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయం తెలిసింది. లేటెస్ట్‌గా భూమా నాగిరెడ్డి జయంతి సందర్భంగా ఆయన సమాధి దగ్గరకు మౌనికతో పాటు వెళ్లి ఆయనకు నివాళులు అర్పించాడు మనోజ్. ఈ ఫొటోలు కూడా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుండటంతో పాటు ఇద్దరి పెళ్లికి ముహూర్తం కూడా ఖరారు అయ్యిందనే విషయం కూడా ప్రచారంలోకి వచ్చింది.

2023 ఫిబ్రవరి 2న మనోజ్, మౌనిక పెళ్లి బంధంతో ఒకటి కానున్నారని వినిపిస్తోంది. అదే నిజమైతే ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కానున్నది. మౌనిక కూడా తొలి భర్త నుంచి విడిపోయారు. చెన్నైలో నివాసం ఉంటున్న ఆమె, ఇటీవలే హైదరాబాద్ వచ్చారనీ, అప్పట్నుంచీ మనోజ్‌తోటే కలిసి ఉంటున్నారనీ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అయితే మౌనికతో వివాహం విషయమై మనోజ్ ఇంతదాకా స్పందించలేదు. త్వరలో తాను కొత్త జీవితం ప్రారంభించబోతున్నానని మాత్రం చెప్పాడు.