English | Telugu

'బ్రహ్మోత్సవం' హీరో ఎవరూ?

మెగా హీరో వరుణ్ తేజతో శ్రీకాంత్‌ అడ్డాల చేసిన 'ముకుంద' బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. వరుసగా రెండు హిట్లు సాధించిన శ్రీకాంత్ అడ్డాలకి ముకుంద ఫ్లాప్ గా భావించవచ్చు. అయితే ఇండస్ట్రీలో ఒక ఫ్లాప్ వస్తే తరువాత సినిమా ఆఫర్ రావడం చాలా కష్టమే కానీ శ్రీకాంత్ అడ్డాలకి మాత్రం వరుస ఆఫర్లు వస్తున్నాయి. ముకుంద సినిమా మధ్యలో మహేష్ బాబుకి, ఎన్టీఆర్ కి స్టోరీలు చెప్పాడట. ఈ ఇద్దరిలో ఒకరితో తన తరువాతి సినిమా వుంటుందని, ఆ హీరో పేరు నిర్మాతలే ప్రకటిస్తారని శ్రీకాంత్ అంటున్నారు.తన సినిమాల కథలన్నీ తన జీవితంలో ఎదురుపడే వ్యక్తులు, సంఘటనలు, అనుభవాల నుంచే స్ఫూర్తి పొంది రాసినవని, ఇకపై కూడా అలాంటి కథలే రాస్తానని అతను తెలిపాడు. 'బ్రహ్మోత్సవం' అనే టైటిల్‌తో తన నెక్స్‌ట్‌ మూవీ ఉంటుందని, ఇది కూడా 'సీతమ్మ వాకిట్లో...' తరహాలోనే ఫ్యామిలీ చిత్రమని చెప్పాడు.