English | Telugu
బూచిలా తయారవుతున్న అతిలోక సుందరి...
Updated : Jun 14, 2013
యాభయ్యేల్ల వయసులో పడి కూడా "పదహారేళ్ల వయసు" కన్యకామణిలా కనబడడం కోసం తన శరీరాన్ని కష్టపెట్టుకుంటున్న ఒకప్పటి అతిలోక సుందరి శ్రీదేవి. తన శరీరాన్ని మాత్రమే కాకుండా.. తన అభిమానుల మనసుల్ని కూడా విపరీతంగా కష్టపెడుతోంది.
యూత్ అమ్మాయిలు లేదా కుర్ర హీరోయిన్స్ వేసుకునే మోడ్రన్ డ్రస్సులు వేసుకోవడం. చీర కట్టినా కూడా వాటిపై స్లీవ్‌లెస్ జాకెట్లు వేసుకోవడం వంటివి చేస్తూ చెత్తగా తయారవుతుంది. ముఖ్యంగా బరువు పెరగకుండా ఉండడం కోసం ఆమె పాటిస్తున్న డైట్ వల్ల ముఖమంతా కూడా పీక్కుపోయి.. కళ్లల్లో ఇంతకు ముందు కనిపించే ఆకర్షించే అందం పోయి.. చాలా భయంకరంగా తయారవుతుంది.
హేమమాలిని, రేఖ వంటి వారు శ్రీదేవి కన్నా వయసులో పెద్దవాళ్ళే. కానీ వారు వయసుకు తగ్గట్లుగా బట్టలు వేసుకుంటూ... ఇప్పటికీ "కలల రాణులు"గా ఒక వెలుగు వెలుగుతుంటే, శ్రీదేవి మాత్రం స్లిమ్‌నెస్ మంత్రం పఠిస్తూ, తన శరీరాన్ని మరి చెండాలంగా మార్చుకుంటుంది. కానీ ఇప్పటికైనా శ్రీదేవి ఈ వాస్తవాన్ని గ్రహించి ట్రెండ్ విషయంలో తన కూతుళ్లతో పోటీపడడం మానేసి.. తనకు ఎలాంటివి అయితే అందంగా కనిపించేలా చేస్తాయో.. అలాంటి దుస్తులు వేసుకుంటే మంచిది. లేకపోతే "అతిలోక సుందరి" అని పిలిచినా అభిమానులే "వామ్మో బూచి" అని భయపడతారు. మరి శ్రీదేవి మళ్ళీ అతిలోక సుందరి అవుతుందా? లేదా? అనే విషయం త్వరలోనే తెలియనుంది.