English | Telugu
వెనుక కూడా అదే పని చేస్తున్నాడంట...!
Updated : Jun 15, 2013
"హ్యాపీడేస్" చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైనా హీరో వరుణ్ సందేశ్. ఈ చిత్రం తర్వాత వరుణ్ సందేశ్ నటించిన "కొత్తబంగారు లోకం", "ఏమైంది ఈవేళ" చిత్రాలు తప్ప, మిగిలిన అన్ని చిత్రాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. అయిన కూడా హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.
ఇదిలా ఉంటే... మొన్నటి వరకు సినిమాల మీద దృష్టి పెట్టిన వరుణ్, ఇప్పుడు అమ్మాయిలపై కన్నేసాడు. "ఏమైంది ఈవేళ" చిత్రం నుండి తాను నటించే చిత్రంలో ఏదో ఒక రొమాంటిక్ సీన్ తప్పకుండా ఉండాలని దర్శక, నిర్మాతలకు చెబుతున్నాడంట. అసలే చైల్డ్ స్మోకర్ గా ఫిల్మ్ సిటీలో పేరుతెచ్చుకున్న వరుణ్, అమ్మాయిలతో కూడా కాస్త రొమాన్స్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం వరుణ్ సందేశ్ "ట్విస్ట్", "అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్", "డి ఫర్ దోపిడీ", "ఉదయం", "నువ్వలా నేనిలా" చిత్రాలతో పాటు మరో రెండు చిత్రాలలో కూడా నటిస్తున్నాడు.