English | Telugu
సమంత పాపకు మీడియా షాక్
Updated : Mar 21, 2014
గతకొంత కాలంగా ఎక్కువగా తన నోటి దురుసును ప్రదర్శిస్తున్న సమంత కు తాజాగా మీడియా సరైన బుద్ధి చెప్పినట్లుగా అనిపిస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని పెద్ద చర్చగా చేయడం లేదా అనవసరపు కామెంట్లు చేసి అందరి చేత తిట్లు తినడం సమంతకు బాగా అలవాటు అయ్యింది. మహేష్ "1", సూర్య "అంజాన్" మూవీ పోస్టర్ ల విషయంలో అదే విధంగా ఇప్పుడున్న టాప్ హీరోయిన్లపై వెటకారంగా కామెంట్లు చేసి తెలుగు, తమిళ ఇండస్ట్రీలో నోటి దురుసు ఎక్కువగా ఉన్న నటి ఈ అమ్మడు బాగా పాపులర్ అయ్యింది.
ఏదైనా చిన్న విషయాన్ని కూడా సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ఈ అమ్మడు ఇటీవలే హిందీలో విడుదలైన "క్వీన్" మూవీని చూసింది. ఈ సినిమాలో కంగనా చాలా బాగా చేసింది. ఈ సినిమాలోని కంగనా పాత్రలో నటించాలని ఉందంటూ ఒక సందర్భంలో తెలిపింది. ఈ విషయాన్ని మీడియా మరొక రకంగా ప్రచారం చేసి సమంతకు షాక్ ఇచ్చింది. "క్వీన్" సినిమా రీమేక్ లో సమంత నటించాలని అనుకుంటుంది. ఈ సినిమా కోసం పారితోషకం కూడా తీసుకోకుండా చేయడానికి సమంత సిద్ధంగా ఉందని మీడియా హంగామా చేసాయి. దాంతో ఈ అమ్మడి డేట్స్ కోసం దర్శక, నిర్మాతలు అడగడం మొదలుపెట్టారు. మీడియా దెబ్బకు కంగుతిన్న సమంత వెంటనే స్పందిస్తూ... మీడియాలో వచ్చే వాటిలో నిజం లేదు అంటూ కొట్టిపారేసింది.
ఈ అమ్మడికి ఇప్పటికైనా బుద్ధివచ్చి కాస్త నోటి దురుసును తగ్గించుకుంటే మంచిది. లేదంటే భవిష్యత్తులో ఇంకెన్ని పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందో ఏమో!