English | Telugu
తెలుగు స్టార్ హీరోయిన్ తో శింబు పెళ్లి నిజమేనా!
Updated : Sep 30, 2024
తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన శింబు(simbu)గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.సుదీర్ఘ కాలం నుంచి ఎన్నో హిట్ సినిమాలు చేస్తు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించాడు.ముఖ్యంగా రొమాంటిక్ అండ్ లవ్ స్టోరీస్ లో తన సత్తా చాటే శింబు రెండు దశాబ్దాల క్రితమే మన్మథతో తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోగా కూడా మారాడు.
లేటెస్ట్ గా శింబు మ్యారేజ్ గురించి సోషల్ మీడియాలో ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది.ప్రముఖ అగ్ర హీరోయిన్ నిధి అగర్వాల్(nidi agarwal)ని శింబు త్వరలోనే వివాహం చేసుకోబుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. 2021 లో ఆ ఇద్దరు కలిసి ఈశ్వరన్ అనే మూవీలో నటించారు. నిది ఫస్ట్ తమిళ మూవీ కూడా అదే. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందని, తమ ప్రేమ విషయాన్నిఇరు వైపులా పెద్దలకి చెప్పడంతో వాళ్ళు కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు గాని సోషల్ మీడియాలో బాగానే వైరల్ గా అవుతుంది.
కాకపోతే కొన్ని రోజుల క్రితం శింబు తండ్రి, ప్రముఖ దర్శకుడైన రాజేంద్ర మాట్లాడుతు మా శింబు ప్రేమ వివాహమే చేసుకుంటాడని చెప్పిన నేపథ్యంలో నిది, శింబుల పెళ్లి రూమర్ నిజమవ్వచ్చనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. శింబు ప్రస్తుతం మణిరత్నం(mani rathnam)దర్శకత్వంలో కమల్ హాసన్(kamal haasan)హీరోగా తెరకెక్కుతున్న థగ్ లైఫ్(thug life)లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. నిధి ప్రస్తుతం పవన్ కళ్యాణ్(pawan kalyan)తో హరిహర వీరమల్లు(hari hara veeramalu)చేస్తుంది.ఇక నలభై ఒక్క సంవత్సరాల శింబు గతంలో నయనతార, హన్సిక వంటి హీరోయిన్లతో ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే.