English | Telugu

నగ్నంగా నటించనున్న శ్రియ

నగ్నంగా నటించనున్న శ్రియ అని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే "ఇష్టం" సినిమా ద్వారా తెలుగు సినీ రంగంలోకి హీరోయిన్ గా ప్రవేశించింది శ్రియ. ఆ తర్వాత "చెన్నకేశవ రెడ్డి" చిత్రంలో యువరత్న నందమూరి బాలకృష్ణ సరసన "ఠాగూర్" సినిమాలో మెగాస్టార్ సరసన, "నేనున్నాను" చిత్రంలో కింగ్ నాగార్జున సరసన, "సుభాష్ చంద్రబోస్" చిత్రంలో విక్టరీ వెంకటేష్ సరసన, "అర్జున్" సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబు సరసన, "బాలు" సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఇలా తెలుగు అగ్ర హీరోలందరి సరసన నటించిన శ్రియ ప్రస్తుతం ఒక బెంగాలీ సినిమాలో నటించడటానికి అంగీకరించిందని సమాచారం.

ఈ సినిమాలో శ్రియ ఒక వేశ్యపాత్రలో నటిస్తుందట. అపర్ణా ఘోష్ ఈ చిత్రానికి దర్శకురాలు. ఈ చిత్రంలో శ్రియ నగ్నంగా నటించనుందని తెలిసింది. ఈ చిత్రం యొక్క కథ, ఈ చిత్రంలో ఆమె పాత్రకున్న ప్రాథాన్యతల దృష్ట్యా శ్రియ అలా నగ్నంగా నటించేందుకు అంగీకరించిందట.