English | Telugu

విక్రమ్ హీరోగా శంకర్ చిత్రం

విక్రమ్ హీరోగా శంకర్ చిత్రం రానుందని సమాచారం. వివరాల్లోకి వెళితే గతంలో విక్రమ్ హీరోగా, సదా హీరోయిన్ గా, శంకర్ దర్శకత్వంలో వచ్చిన "అపరిచితుడు" చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించింది. తమిళంలో ఈ చిత్రాన్ని "అన్నియన్" పేరుతో విడుదల చేశారు. అక్కడ కూడా ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.

మళ్ళీ వాళ్ళిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం రానుంది. ఈ చిత్రంలో విక్రమ్ సరసన ఆశిన్ కథా నాయికగా నటించనుందట. ఈ చిత్రాన్ని ఎనభై కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారట. ఈ చిత్రాన్ని రాజకీయ నేపథ్యంలో శంకర్ తీస్తున్నాడని తమిళ సినీ పరిశ్రమ అంటూంది. అంటే దర్శకుడు శంకర్ భారత దేశ రాజకీయాలను ఘాటుగా విమర్శించే ప్రయత్నం చేస్తాడని సినీ వర్గాలంటున్నాయి.