English | Telugu
యన్ టి ఆర్ శక్తి కి వరల్డ్ కప్ ప్రెజర్
Updated : Mar 23, 2011
యన్ టి ఆర్ "శక్తి" కి వరల్డ్ కప్ ప్రెజర్ వెంటపడుతూంది. వివరాల్లోకి వెళితే వైజయంతీ మూవీస్ పతాకంపై, యన్ టి ఆర్ హీరోగా, ఇలియానా, మంజరి ఫడ్నిస్ హీరోయిన్లుగా, మెహెర్ రమేష్ దర్శకత్వంలో, అత్యంత భారీ బడ్జెట్ తో అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం"శక్తి". ఈ చిత్రానికి మణిశర్మ అందించిన సంగీతం ఇటీవలే విడుదలై, చక్కని ప్రేక్షకాదరణ పొందుతూంది. అయితే యన్ టి ఆర్ శక్తి చిత్రానికి వరల్డ్ కప్ ప్రెజర్ వెంటాడుతూంది. కారణం ఏమిటంటే మార్చ్ 24 వ తేదీన ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ లో భారత్ నెగ్గినట్లయితే, యన్ టి ఆర్ "శక్తి" విడుదలవుతున్న మ,ఆర్చ్ 30 వ తేదీన వరల్డ్ కప్ సెమీఫైనల్స్ మ్యాచ్ లో ఇండియా ఆడటం జరుగుతుంది.
ఇండియన్ క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్స్ మ్యాచ్ లో ఆడుతూంటే ఆరోజు విడుదలయ్యే ఈ యన్ టి ఆర్ "శక్తి" సినిమాకి భారీ ఓపెనింగ్స్ రావేమోనని బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లూ ఆందోళన చెందుతున్నారు. అందుకని ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రాన్ని మార్చ్ 30 వ తేదీన కాకుండా మార్చ్ 31 వ తేదీన విడుదల చేయాల్సిందిగా ఈ చిత్ర నిర్మాత అశ్వనీదత్ ని వారు కోరుతున్నారని సమాచారం. మరి ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్ర నిర్మాత అశ్వనీదత్ ఏమంటారో వేచి చూడాలి.