English | Telugu
యన్ టి ఆర్ పెళ్ళికి మామ మెగా బహుమతి
Updated : Mar 24, 2011
యన్ టి ఆర్ కి మామ మెగా బహుమతి ఇస్తున్నాడని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. వివరాల్లోకి వెళితే యువ హీరో యంగ్ టైగర్ యన్ టి ఆర్ వివాహం మే 5 వ తేదీన, ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు ఏకైక కుమార్తె కుమారి లక్ష్మీ ప్రణతితో ఘనంగా వివాహం జరుగనుంది. ఈ వివాహానికి ముందుగా యన్ టి ఆర్ హీరోగా నటిస్తున్న"శక్తి" చిత్రం విడుదల కానుంది.
ఈ చిత్రం మన ఆంధ్రప్రదేశ్ లో సుమారు నాలుగువందల థియేటర్లలో విడుదల కానుంది. యన్ టి ఆర్ కి పెళ్ళి కానుకగా ఈ థియేటర్లన్నింటిలో ఈ "శక్తి" చిత్రాన్ని ఒక సంవత్సరం పాటు ఆడిస్తానని యన్ టి ఆర్ కాబోయే మామగారు నార్నే శ్రీనివాసరావు అన్నారట. అదే జరిగితే తెలుగు చలన చిత్ర చరిత్రలో నభూతో నభవిష్యతిగా ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రం రికార్డ్ సృష్టించటం ఖాయం.
కానీ దీనికి యంగ్ టైగర్ యన్ టి ఆర్ " మావయ్యా నా "శక్తి" చిత్రం ఆడినన్ని సెంటర్లలో, ఆడగలిగినన్ని రోజులు ఆడనివ్వండి. అది రికార్డులు సృష్టిస్తే ఒ.కె. కానీ రికార్డుల కోసం ఇలా ఆడించాలనుకుంటే అందుకు నేనొప్పుకోను. నేను రికార్డుల కోసం నటించటం లేదు. ప్రజలకు ఆనందం కలిగించటానికి, మా నందమూరి అభిమానుల కోసం, తాతగారి పేరు నిలబెట్టటానికి మాత్రమే నేను సినిమాల్లో నటిస్తున్నాను." అని అన్నారట. దటీజ్ యన్ టి ఆర్...