English | Telugu
చరణ్‌తో సానియా?
Updated : Dec 17, 2014
తెలుగునాట ఓ ఇంట్రస్ట్రింగ్ కాంబినేషన్ సెట్ కాబోతోందా?? రామ్‌చరణ్, టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా కలసి నటించబోతున్నారా?? ఆ అవకాశాలున్నాయని చెప్తున్నాయి టాలీవుడ్ వర్గాలు. చరణ్ - శ్రీనువైట్ల కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమలో సానియా స్పెషల్ పాత్రలో కనిపించనుందని టాక్. ఇది వరకు బ్యాట్మెంటెన్ క్రీడాకారణి గుత్తా జ్వాలా నితిన్ సినిమాలో మెరిసింది. అలానే ఇప్పుడు సానియాని రంగంలోకి దింపాలని చిత్రబృందం భావిస్తోంది. సానియా కూడా వెండి తెరపైకి ఎంట్రీ ఇవ్వాలని ఉబలాటపడిపోతోందని టాక్. తనకు ఎప్పటి నుంచో నటించాలన్న కోరిక ఉన్నా, సరైన ప్రాజెక్ట్ రాకపోవడంతో... వెనకడుగు వేస్తోందట. ఈసారి ఈ ఛాన్స్‌ని మాత్రం మిస్ చేసుకొనే అవకాశం లేదని తెలుస్తోంది. చరణ్ సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని టాలీవుడ్ చెప్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.