English | Telugu
కొత్తజంట నుండి అతడిని తీసేసారట...!
Updated : Mar 8, 2014
"హృదయ కాలేయం" సినిమాతో హీరోగా పరిచయమవుతున్న సంపూర్నేష్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాడు. సినిమా విడుదలకు ముందే ఇతనికి వస్తున్న స్పందన భారీగా పెరిగిపోతుంది. అయితే సంపూర్నేష్ ను మారుతి దర్శకత్వం వహిస్తున్న "కొత్త జంట" సినిమాలో ఓ కీలక పాత్రలో తీసుకున్నాడు. ఈ సినిమాలో అదిరిపోయే రేంజులో సంపూర్నేష్ నటించాడట. అయితే గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతుంది. తన కొడుకు సినిమాలో సంపూర్నేష్ నటిస్తే మొత్తం క్రెడిట్ అతనికే వెళ్తుందని భావించిన అరవింద్ సంపూర్నేష్ పాత్రను మొత్తం తీసేయించేసి.. ఆ పాత్రలో పోసాని చేత రీ షూట్ చేస్తున్నారని తెలిసింది. అందుకే ఈ సినిమా విడుదల లేట్ అయిందని తెలుస్తుంది. మరి ఈ విషయంపై సంపూర్నేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.