English | Telugu
పవన్ కోసం రేసుగుర్రం వాయిదా పడుతుందా...?
Updated : Mar 10, 2014
అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "రేసుగుర్రం" చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని మార్చి 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేసారు. కానీ పవన్ కళ్యాణ్ తన రాజకీయాల గురించి మార్చి 14న తెలియజేయనున్నాడు. అందువల్ల ఈ ఆడియో కార్యక్రమాన్ని వాయిదా వేసే పనిలో ఉన్నారట చిత్ర యూనిట్. మార్చి 28న సినిమా విడుదల చేయాలని అనుకున్నారు కానీ ఈ అనుకోని పరిస్థితుల వలన ఆడియో విడుదలతో పాటు సినిమా విడుదల కూడా వాయిదా పడేలా ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ సినిమాను ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేయనున్నారు. లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్లో నల్లమలుపు బుజ్జి, కె.వెంకటేశ్వర రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్, సలోని కథానాయికలు.